Farmers Protest: రైతు నిరసనలకు 300 రోజులు

23 Sep, 2021 11:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద రైతులు చేపట్టిన నిరసనలు బుధవారానికి 300 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చ సభ్యులు మాట్లాడుతూ.. లక్షలాది మంది రైతుల ఆవేదనను తమ నిరసనలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. రైతుల్ని ఢిల్లీ సరిహద్దులకు చేర్చి 300 రోజులైందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

రైతులు తమ నిరసనను శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని అన్నారు. తమ డిమాండ్లు ఏమిటో ప్రధాని మోదీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసని వ్యాఖ్యానించారు. రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. దేశంలో జరిగే ఎన్నికల్లో రైతులు ఓట్లు వేసే వారే గెలుస్తున్నారని, అంత లోతుగా రైతులు వేళ్లూనుకొనిపోయిన వ్యవస్థ భారత్‌ది అని పేర్కొన్నారు. ఈ నెల 27న సంయుక్త కిసాన్‌ మోర్చ ‘భారత్‌ బంద్‌’ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపింది.

చదవండి:  కశ్మీర్‌లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు

మరిన్ని వార్తలు