ఢిల్లీ రైతుల ఆందోళనలు - తాజా పరిణామాలు..!

2 Dec, 2020 15:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ​కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో నూతనంగా తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య జరిగిన సమావేశం ఓ కొలిక్కి రాలేదు. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, రైతు సంఘాలతో చర్చించామని అన్నారు. డిసెంబరులో జరిగే నాల్గవ రౌండ్ సమావేశంలో వాటిని చేపట్టేలా చర్యలు తీసుకుంటామని బుధవారం దీనికి సంబంధించిన విషయాలను ప్రభుత్వంతో పంచుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులను కోరారు.

రైతుల నిరసన: తాజా పరిణామాలు

  • వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉన్నారు. దీనిపై ఆయన ట్విటర్‌ లో మాట్లాడుతూ.. ఈ చట్టాలు రైతుల ఆదాయం పెంచడానికి అని చెప్పారని కానీ దీని వల్ల రైతుల ఆదాయం సగానికి సగం తగ్గుతుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అబద్దాల, దోపిడి ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
  • మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న తాజా పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్ ఒక సమావేశం నిర్వహించారు.
  • ఆందోళన కొనసాగుతుండగా, ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని సరిహద్దులను అడ్డుకున్నారు, భారీ పోలీసు మోహరింపుతో ఎంట్రీ పాయింట్లను మూసివేశారు. ఆందోళన సమయంలో రైతులను నియంత్రించడానికి కాంక్రీట్ అడ్డంకులు, బారికేడ్లను ఉంచారు.
  • దేశ రాజధానిలో జరిగిన నిరసనల వెనుక ప్రతిపక్ష నాయకుల హస్తం ఉందని కేంద్ర మంత్రి వికె సింగ్ మంగళవారం ఆరోపించారు. చిత్రాల్లో చాలా మంది రైతులు రైతులుగా కనిపించలేదని, ప్రతి పక్షపార్టీ కార్యకర్తల్లా కనిపించారని ఆరోపించారు.
  • బిజెపికి మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) వ్యవసాయ బిల్లులపై ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉంది.రైతుల గురించి బీజేపీ తక్కువ అంచనా వేసిందని కానీ ఇప్పుడు అర్థం అవుతుందని అని సీనియర్ అకాలీ నాయకులు ఎస్ బల్విందర్ సింగ్ భుందర్ అన్నారు.
  • ఆందోళన చేస్తున్న రైతులకు ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్, ఆప్ నాయకుడు అతిషి మద్దతు తెలిపారు. రైతులు చేసిన అన్ని డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అన్నారు. "ఎంఎస్‌పి హామీని చట్టం పరిధిలో ఉంచాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అంగీకరిస్తామని, ఎంఎస్‌పిని ఒకటిన్నర రెట్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని చట్టబద్ధంగా తొలగించింది" అని అతిషి చెప్పారు.

గత పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం క్లియర్ చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ చట్టాలు రైతులను శక్తివంతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు సహా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినప్పటికీ, చట్టాలను వెనక్కి తీసుకురావాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు