రేపటి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి.. లేదంటే బాదుడే

14 Feb, 2021 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా రేపటి (ఫిబ్ర‌వ‌రి 15) నుంచి ఫాస్టాగ్ తప్పనిసరిగా అమ‌ల్లోకి రానుంది. వాహ‌నాల‌కు ఫాస్టాగ్ ఉంటేనే హైవేల‌పైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాదుడు భరించాల్సివుంటుంది. ఇప్ప‌టికే పలుమార్లు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి వినియోగాన్ని వాయిదా వేస్తూ వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వం.. సోమ‌వారం నుంచి తప్పనిసరిగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఫాస్టాగ్‌ వినియోగంతో హైవేల‌పై టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర సమయం వృథా అయ్యే అవ‌కాశం ఉండ‌దు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేష‌న్ ప‌త్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌ ఖరీదు వాహనంపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇక ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ను ఆన్‌లైన్‌ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు