మలి వయసులో ఇదేం పాడు బుద్ధి.. 89 ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసిన భార్య

12 Sep, 2022 21:25 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్ వడోదరలో 89ఏళ్ల భర్తపై ఫిర్యాదు చేసింది 87ఏళ్ల భార్య. వృద్ధ వయసులోనూ ఆయన రోజూ శృంగారం కావాలని తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. మహిళల కోసం గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ 181 అభయంకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. తన భర్త నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసింది. 

ఫిర్యాదు విని షాక్‌కు గురైన అభయం టీం వెంటనే రంగంలోకి దిగింది. వృద్ధ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ వయసులో యోగా చేయాలని, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని సూచించింది. వీలైతే సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన పార్కులలో సేదతీరాలని చెప్పింది.  భార్యను ఇబ్బందిపెట్టవద్దని భర్తకు సూచించి సమస్యను పరిష్కరించింది.

తన భర్తకు ఎప్పుడూ అదే ధ్యాస అని, శృంగారానికి ఒప్పుకోకపోతే తనపై కోపపడతాడని భార్య చెప్పింది. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినకుండా భర్త పదే పదే బలవంతం చేయడం వల్లే గత్యంతరం లేక ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
చదవండి: డ్రగ్స్ మత్తులో రోడ్డుపై కాలు కదపలేని స్థితిలో యువతి.. వీడియో వైరల్..

మరిన్ని వార్తలు