ప్రధానిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంచలన వ్యాఖ్యలు

3 Jun, 2023 15:48 IST|Sakshi

వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ కాంగ్రెస్ నుండి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా భారత ప్రధాన మంత్రికి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న కీర్తిప్రతిష్టలు చూస్తోంటే భారతీయుడిగా చాలా గర్వాంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ విదేశీ వ్యవహారాల ఛైర్  పర్సన్ సామ్ పిట్రోడా.  

ఫ్యూచర్ లీడర్... 
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి సహాయకులుగా వ్యవహరిస్తున్నారు సామ్ పిట్రోడా. వాషింగ్టన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పర్యటన గురించి ప్రస్తావించగా రాహుల్ గాంధీకి ప్రస్తుత కార్యాచరణపై స్పష్టమైన అవగాహన ఉందని, భారత దేశంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

పెరుగుతోన్న మోదీ  క్రేజ్... 
త్వరలో ప్రధానమంత్రి యూఎస్ పర్యటన గురించి ప్రశ్నించగా పిట్రోడా సమాధానమిస్తూ... భారత ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా లభిస్తోన్న గౌరవం చూస్తుంటే నా హృదయం కూడా ఉప్పొంగింది. భారత ప్రధాని ఎక్కడికి వెళ్ళినా ఆయనకు గొప్ప ఆదరణ లభిస్తోందని నాతో ఎవరో అన్నప్పుడు ఓ భారతీయుడిగా చాలా గర్వించాను. 

ప్రధాని మోదీని  అందరూ గౌరవిస్తున్నారంటే అది ఆయనకు దక్కిన గౌరవం కాదు, భారత దేశానికి దక్కిన గౌరవం. ఆయన నాతో సహా 150 కోట్ల భారతీయులకు ప్రధాన మంత్రి. కేవలం బీజేపీకి మాత్రమే కాదు, అందుకే ఆయనకు ఇంతటి ఘనత, గౌరవసత్కారాలు దక్కుతున్నాయన్నారు.  

ఇది కూడా చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు  

మరిన్ని వార్తలు