పింఛనుకు సంతానాన్నీ నామినేట్‌ చేయొచ్చు

30 Jan, 2024 06:15 IST|Sakshi

మహిళా ఉద్యోగులకు కేంద్రం వెసులుబాటు

న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగుల కుటుంబ పింఛను విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు పెన్షన్‌ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటి వరకు మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబసభ్యులకు పింఛను అర్హత ఉండేది.

whatsapp channel

మరిన్ని వార్తలు