బార్‌లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు

8 Apr, 2023 11:19 IST|Sakshi

బార్‌లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనకు సంబంధించి పదిమందిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని బార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..నిన్న సాయంత్రం ముంబై బార్‌ సిబ్బందికి కస్టమర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో ఇరు వర్గాలు ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం వంటివి చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురు సిబ్బందిని, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

(చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్‌ పవార్‌)

మరిన్ని వార్తలు