ఆరోగ్యరంగానికి అరకొర వ్యయమే

2 Feb, 2021 01:43 IST|Sakshi

‘ఆరోగ్య పరిరక్షణ ఎట్టకేలకు ప్రధాన పాత్ర పోషించబోతోంది’ అని మొన్న ఆర్థిక సర్వే ప్రక టించింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఆరు కీలక స్తంభాల్లో ఆరోగ్యం మొదటిది. ప్రజారోగ్యానికీ, శ్రేయస్సుకూ ఈసారి కేటాయింపులు 137 శాతం పెంచుతున్నామని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సగర్వంగా చెప్పారు. అయితే మాట్లాడినంత ఘనంగా పరిస్థితేమీ లేదని బడ్జె ట్‌ను తరచి చూస్తే అర్థమవుతుంది. కరోనా మహ మ్మారి తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యరంగానికి కేటా యింపులు ముందుగా ఊహించిందే. మన ఆరోగ్య వ్యవస్థ లోని లోపాలను కరోనా బహిర్గతం చేసింది. రోగ వ్యాప్తిగానీ, దాని పర్యవసానంగా కలిగిన మర ణాలుగానీ అంచనా వేసినంతగా లేకపోవటం అదృ ష్టమే. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యరంగానికి వన రులు పుష్కలంగా వుండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది.

ఆరోగ్యరంగంపై సమగ్ర దృష్టి సారిస్తూ వ్యాధి నిరోధకత, స్వస్థ పర చటం, శ్రేయస్సు అనే మూడు అంశాలను పటిష్ట పరచాలని నిర్ణయించామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ యోజన అనే పేరిట కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాథ మిక, మాధ్యమిక, ప్రాంతీయ స్థాయిల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం దీని ధ్యేయం. వచ్చే ఆరేళ్లలో ఇందుకోసం రూ. 64,180 కోట్లు వ్యయం చేస్తారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 10,700 కోట్లు. నిరుడు ఆరోగ్యానికి రూ. 67,484 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే అది రూ. 94,452 కోట్లకు పెరి గింది. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేసి, వచ్చే మూడు నాలుగేళ్లలో క్రమేపీ పెంచుకుంటూ పోతే తప్ప ఆరోగ్య రంగ వ్యయంపై మనం పెట్టు కున్న లక్ష్యాలను సాధించటం సాధ్యం కాదు. 

ఆరోగ్య రంగ వ్యయాన్ని పెంచాల్సిన అవస రాన్ని ఆర్థిక సర్వే కూడా అంగీకరించింది. ఆరోగ్య పరిరక్షణకయ్యే ఖర్చులో 60శాతం ప్రజానీకం వాటా వుండగా మిగిలింది ప్రభుత్వ వ్యయం. మన జీడీపీలో ప్రస్తుతం ఆరోగ్యరంగ వాటా 1 శాతం కన్నా చాలా తక్కువ. దీన్ని 3 శాతానికి పెంచితే తప్ప ప్రజలపై భారం తగ్గదు. 2017నాటి జాతీయ జాతీయ ఆరోగ్య విధానం కూడా ఈ మాటే చెప్పింది. మెరుగైన ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో మన స్థానం 145. ఈసారి పరిస్థితి మారుతుందనుకుంటాము. కానీ ఆమె కేటాయించిన రూ. 2,23,846 కోట్లలో పౌష్టి కాహారం, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్యం అంశాలపై చేసే ఖర్చు కూడా వుంది. వీటికి ప్రాధా న్యత లేదని ఎవరూ అనరు.

కానీ ఆరోగ్య వ్యయంగా ఆ అంశాలను చూపడం సరికాదు. అలాగే వ్యాక్సిన్ల కోసం చేసిన రూ. 35,000 కోట్ల కేటాయింపు కూడా ఈ ఏడాదికి పరిమితమైనది. దాన్ని రెగ్యులర్‌ ఆరోగ్య బడ్జెట్‌లో భాగంగా పరి గణించలేం. మన ఆరోగ్య రంగ బడ్జెట్‌ జీడీపీలో ఇప్పటికీ 0.34 శాతం మాత్రమే. జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాన్ని సాధించాలంటే 2021– 22లో జీడీపీలో 1.92 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేయాలని ఫైనాన్స్‌ కమిషన్‌ ఇప్పటికే చెప్పింది. అందుకు మనం ఎంత దూరంలో వున్నామో చూస్తే ఆశ్చర్యం కలుగు తుంది. కరోనా మహమ్మారి వంటిది కూడా మన ప్రభుత్వాన్ని కదిలించలేకపోతే దాన్ని మరేది ప్రభావితం చేయగలదు?
– ప్రొఫెసర్‌ దీపా సిన్హా 

మరిన్ని వార్తలు