సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ఫైన్‌.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌

16 Oct, 2021 08:29 IST|Sakshi

సాధారణంగా నింబంధనలు పాటించని వాహనాదారులను ఆపి ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేస్తారు. ఫైన్‌ వేసినప్పుడు వావాహనదారుడి వివరాలను తీసుకొని రశీదు ఇస్తారు. అయితే ట్రాఫిక్‌ పోలీసులకు దొరికిపోయిన ఓ వాహనదారుడు చెప్పిన వివారాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని ట్రాఫిక్‌ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేస్తాడు.

అయితే అప్పటికే తాను ఫైన్‌ కట్టినట్లు ఆ వాహనదారుడు చెబుతాడు. అయితే తప్పనిసరిగా మళ్లీ జరిమానా కట్టాలని పోలీసులు అనడంతో.. చేసేదేంలేక ఆ వాహనదారుడు తన అసలు పేరు కాకుండా..  తన పేరు రామా(రామన్‌)అని, తండ్రి పేరు దశరథ, ఊరు అయోధ్య అని చెబుతాడు. ప్రభుత్వానికి ఫైన్ల రూపంలో డబ్బు వస్తున్నప్పుడు ప్రయాణికుడు ఏం చెప్పినా తనకు అవసరం లేదన్నట్టు పోలీసు రశీదు రాసి ఇస్తాడు. 

దీనికి సంబంధించిన రశీదును వాహనదారుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇటీవల కాలంలో కేరళలో ట్రాఫిక్‌ పోలీసులు కారణం లేకుండా జరిమానాలు విధిస్తూ.. ప్రజల నుంచి  డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌, కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు విచ్చలవిడిగా ఫైన్‌ వేసిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు