మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

17 Jan, 2021 11:31 IST|Sakshi

సాక్షి, కేరళ: తిరువనంతపురం జిల్లాలో మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌ లగేజ్‌ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ప్రయాణికులు గుర్తించి గార్డుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు