పుణె రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం

7 Jun, 2021 19:46 IST|Sakshi

18 మంది సిబ్బంది మృతి 

పుణె: పుణె పారిశ్రామిక వాడలోని ఓ రసాయన కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 18 మంది చనిపోయారు. పుణె శివారు పిరంగూట్‌లోని ఎస్‌వీఎస్‌ ఆక్వా టెక్నాలజీస్‌ పరిశ్రమలో సోమవారం సాయం త్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ‘ఈ ఘటనలో కాలిపోయి, గుర్తు పట్టేందుకు వీలుకాని స్థితిలో ఉన్న 18 మృతదేహాలను వెలికి తీశాం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే.

పరిశ్రమ ఆవరణలో ప్లాస్టిక్‌ మెటీరియల్‌ను ప్యాక్‌ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది’అని పుణే చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ దేవేంద్ర వెల్లడించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్లాస్టిక్‌ కారణంగానే మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని ఆయన అన్నారు. నీటి శుద్ధికి వాడే క్లోరిన్‌ డయాక్సైడ్‌ ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.    

చదవండి: Iran: అతిపెద్ద యుద్ధనౌక కథ విషాదాంతం

>
మరిన్ని వార్తలు