అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి దుర్మరణం

26 Aug, 2022 09:04 IST|Sakshi

లక్నో: అర్ధరాత్రి చెలరేగిన భారీ అగ్నిప్రమాదంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ఉత్తర ప్రదేశ్‌ మోరాదాబాద్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. అందులో ఒకరికి ఫంక్షన్‌ హాల్‌ ఉంది. ఆ సామాన్లను బిల్డింగ్‌ కింది ఫ్లోర్‌లో ఉంచాడతను.

అయితే గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. ఆ సామాన్లు తగలబడ్డాయి. క్రమంగా మూడంతస్తుల బిల్డింగ్‌లో మంటలు చెలరేగి..  ఎగిసిపడ్డాయి. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. 

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. ఐదు ఫైర్‌ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లోంచి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. వీళ్లలో ఐదుగురు గాయాలతో కన్నుమూశారు. మిగతా ఏడుగురిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్‌ శైలేందర్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు