Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. టెన్షన్‌లో కార్యకర్తలు

7 Jun, 2022 12:12 IST|Sakshi

ఆర్​జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జార్ఖండ్‌లో పలామూ జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటున్న ఆయన గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లాలూ ప్రసాద్ యాదవ్​కు ఎలాంటి అపాయం జరగలేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా లాలూ ప్రసాద్.. పలామూకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆయన స్థానిక అతిథి గృహంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క‍్రమంలో మంగళవారం ఉదయం.. లాలూ టిఫిస్‌ చేస్తున్న సమయంలో గదిలోని ఫ్యాన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప‍్రమత్తమైన భద్రతా సిబ్బంది లాలూను వెంటనే బయటకు తీసుకువచ్చారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి.. అనంతరం ఫ్యాన్​ను తొలగించారు. లాలూకు ప్రమాదమేమీ జరగకపోవడంతో అధికారులు, పార్టీ కార్యకకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: ఇక ‘చాన్సలర్‌’ మమత బెనర్జీ

మరిన్ని వార్తలు