పుణెలోని బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో జహీర్‌ ఖాన్‌ రెస్టారెంట్‌

1 Nov, 2022 15:00 IST|Sakshi

పుణె: మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్‌ చౌక్‌ ప్రాంతంలోని మార్వెల్ విస్టా భవనం టాప్‌ ఫ్లోర్‌లోని వెజిటా రెస్టారెంట్‌లో ఉదయం 8.45 నిమిషాలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాయి. మూడు ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు పుణె అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇందులో మంటల ధాటికి కాలిపోతున రెస్టారెంట్‌ రూఫ్‌, కీటికీలు కూలి కిందపడిపోవటం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాద సమమంలో రెస్టారెంట్‌ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే బిల్డింగ్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌ రెస్టారెంట్‌ కూడా ఉన్నట్లు తెలిసింది.
చదవండి: ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు

మరిన్ని వార్తలు