టీఎంసీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు 

8 Jun, 2021 15:01 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీ ఎమ్మెల్మే మదన్‌ మిత్రా నివాసంలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతాలో ఉంటున్న మదన్‌ మిత్రా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందే గ్రహించిన మదన్‌ ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని.. ప్రమాదానికి షార్ట్‌ సర్య్కూటే కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఈ విషయమై మదన్‌ మిత్రా స్పందిస్తూ.. '' ఇది మా పూర్వీకుల ఇళ్లు. ఇవాళ ఉదయం ఇంట్లో ఏదో పేళుళ్ల శబ్ధం వినిపించింది. దీంతో అగ్ని ప్రమాదం జరుగుతుందని ముందే గ్రహించాను. వెంటనే కుటుంబ సభ్యులను అలర్ట్‌ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని చెప్పాను. దేవుడి దయవల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం'' అని పేర్కొన్నారు.
చదవండి: హిమాచల్‌ ప్రదేశ్‌లో తొలిసారి కింగ్‌ కోబ్రా ప్రత్యక్షం.. వైరల్‌

Mizoram: పరీక్షలు రాయాలి.. సిగ్నల్స్‌ రావడం లేదు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు