ఢిల్లీలో డెంగీ తొలి మరణం

19 Oct, 2021 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో డెంగీ బారిన పడి ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది ఇదే తొలి మరణమని వెక్టార్‌ డిసీజ్‌ పౌర నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సరితా విహార్‌కు చెందిన మమత(35) డెంగీ బారిన పడి సెప్టెంబర్‌ 20న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్‌ 25న మృతి చెందారని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 16 వరకూ ఢిల్లీలో 723 డెంగీ కేసులు నమోదు అయ్యాయని, గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌ 9 వరకూ 480 కేసులు వెలుగులోకి రాగా ఒక్క వారంలోనే 243 కేసులు నమోదు అయ్యాయని తెలిపింది.

గడిచిన 2 వారాలుగా ఢిల్లీలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి పేర్కొన్నారు. 2020లో 1,072 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారని, 2019లో ఇద్దరు, 2018లో నలుగురు, 2017లో 10 మంది, 2016లో 10 మంది మృతి చెందారని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు, మార్చిలో ఐదు, ఏప్రిల్‌లో పది, మేలో 12, జూన్‌లో ఏడు, జూలైలో 16, ఆగస్ట్‌లో 72, సెప్టెంబర్‌లో 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 16 వరకూ ఢిల్లీలో మలేరియా కేసులు 142, చికున్‌గున్యా కేసులు 69 నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. (చదవండి: కోవాగ్జిన్‌పై అదనపు సమాచారం కావాలి: డబ్ల్యూహెచ్‌ఓ)

మరిన్ని వార్తలు