చేపకు.. ఆపరేషన్‌

3 Mar, 2021 19:55 IST|Sakshi

చేపకు ఆపరేషన్‌ ఏంటి అనుకుంటున్నారా? 
అవును నిజంగా ఇది జరిగింది. 
అదీ మన దేశంలోని కేరళలోనే. 
ప్రాణాపాయ స్థితిలో ఉన్న చేపకు ఆపరేషన్‌ చేసి బతికించారు డాక్టర్లు. 
ఇది ఎలా? ఎందుకు? అంటే..
 
తిరువనంతపురం జూలో ఉన్న అక్వేరియంలో ఈల్‌ రకం చేప తీవ్రంగా గాయపడింది. దీనిని గుర్తించిన జూ సిబ్బంది. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెటర్నరీ డాక్టర్లను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన డాక్టర్లు మూడు గంటల పాటు శ్రమించి చేపను బతికించారు.  

చేపల మధ్య ఫైట్‌
ఆ అక్వేరియంలో మూడు ఈల్‌ చేపలను వదిలారు. అందులోని 600 గ్రాముల బరువున్న ఆడ చేపపై ఇంకో ఈల్‌ చేప దాడి చేసింది. ఆ దాడిలో ఆడ చేప చర్మం చీరుకుపోయింది. ప్రేగులు కూడా బయటకు వచ్చేశాయి. దాని పరిస్థితి క్రిటికల్‌గా మారింది. సమాచారం అందుకుని వెంటనే వచ్చిన జూ వెటర్నరీ డాక్టర్‌ జాకోబ్‌ అలెగ్జాండర్‌ చేప పరిస్థితి అంచనా వేశారు. వెంటనే ఆపరేషన్‌ అవసరం అని చెప్పారు. ఈయనకు మరో ఇద్దరు డాక్టర్లు టిటు అబ్రహం, అమృత లక్ష్మి హెల్ప్‌ చేశారు. అయితే చేపకు మత్తుమందు ఇవ్వడమే వారికి పెద్ద ఆటంకంగా మారింది. ఎట్టకేలకు దానికి మత్తు ఇచ్చి ఆపరేషన్‌ చేశారు. చేపకు 30 కుట్లు వేశారు. దానిని ప్రత్యేక ట్యాంకులో ఉంచి పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్‌ చేయడం దేశంలోనే మొదటిగా భావిస్తున్నారు.

చదవండి: 
గుండెతో స‌హా అమ్మ‌కానికి '‌అమ్మ' అవ‌య‌వాలు

హైవేపై కొండచిలువ.. ఒంటిచేత్తో

మరిన్ని వార్తలు