మోదీ నినాదంతో ఎంపీ రవికిషన్‌..

3 Nov, 2020 12:16 IST|Sakshi

పట్నా: బిహార్‌ ఓటర్లు కోవిడ్‌-19 జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ నినాదమిచ్చారు. యూపీ ఓటర్లకు కూడా ఇదేవిధంగా సందేశమిచ్చారు. ప్రస్తుతం బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని రవికిషన్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఉపఎన్నికలు జరగబోతున్నందున రాష్ట్ర ప్రజలకు కూడా ఇదే పిలుపునిచ్చారు. ‘ముందు ఓటు వేయండి ఆ తర్వాత సేద తీరండి’ అనే ప్రధాని నరేంద్ర మోదీ నినాదంతో రవికిషన్‌ ప్రజలను ఓటు వేయమని కోరుతున్నారు. కోవిడ్‌-19 జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ ఓటు హక్కు వినియోగించుకోని ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

చదవండి: నటుడు రవికిషన్‌కు వై-ప్లస్‌ భద్రత

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు