కుప్పకూలిన ఐదంతస్తుల బిల్డింగ్‌

24 Aug, 2020 20:41 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌లో సోమవారం దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద 200 మందికి పైగా చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన పట్ల పలువురు విషాదం వ్యకం చేస్తున్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారికి తక్షణ సాయం అందించాలని సీఎం ఆదేశించారు. 

చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు