-

విషాదం: కరోనాతో పోరాడుతూ ఐదు నెలల చిన్నారి మృతి

14 May, 2021 13:48 IST|Sakshi

న్యూఢిల్లీ : చిన్నారిని కాపాడేందుకు వాళ్ల కుటుంబం సాయశక్తులా ప్రయత్నించారు. కానీ మాయదారి కరోనా 5నెలల చిన్నారిని కబలించింది. ఆరు రోజులుగా మృత్యువుతో పొరాడుతూ చివరకు తుదిశ్వాస విడిచింది. ఈ విషాద ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన పరి అనే 5నెలల చిన్నారికి ఇటీవలె కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు. చిన్నారికి బతికించుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు.

చిన్నారికి  హెమోగ్లోబిన్‌ లెవల్స్‌ తక్కువగా ఉండటంతో చిన్నారి మామయ్య కొద్ది రోజుల క్రితమే రక్తం ఇచ్చారు. పరి త్వరగా కోలుకొని ఇంటికి  తిరిగొస్తుందని ఆమె కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ  మహమ్మారి కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఫలితంగా ఆరు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న చిన్నారి పరి పరిస్థితి విషమించి కన్నుమూసింది. 'కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి పరిని ఎంతో ఇబ్బంది పెట్టింది. తన ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీసింది. ఆ సమయంలో నా బిడ్డ ఎంత బాధ అనువించిందో' అంటూ పరి తండ్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

ఇక పరి మరణం తనకు ఎంత బాధ కలిగించిందని ఢిల్లీలోని పొలిటికల్‌ లీడర్‌, సామాజిక కార్యకర్త జితేందర్ సింగ్ అన్నారు. కొంత మంది టీంతో కలిసి కోవిడ్‌ పేషెంట్లకు ఆయన దహన సంస్కారాలు చేయిస్తుంటారు. అలా ఇప్పటికే 2వేలకు పైగా కోవిడ్‌ పేషెంట్లకు అంత్యక్రియలు జరిపించారు. అయితే పరిని దహనం చేసేటప్పుడు కన్నీళ్లు ఆగలేదని, తను అచ్చం దేవతలా ఉంటుందని, పరి కటుంబానికి తీరని మరోవేదనను మిగిల్చింది అని అన్నారు.

పరి 3ఏళ్ల అన్నయ్య రోజు పరిని వీడియో కాల్‌లో చూసేవాడని, ఇప్పుడు కేవలం తన తండ్రి మొబైల్‌లోని పరి ఫోటోలు మాత్రమే వారికి ఙ్ఞాపకాలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే మూడో ముప్పు పొంచిఉందని కరోనా థర్డ్‌ వేవ​ త్వరలోనే వస్తుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ముందు నుంచే అప్రమత్తం లేకపోతే పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని, ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా కోవిడ్‌ బారిన పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు