Five States Election Results 2022: కచ్చితమైన సమాచారం కోసం..

9 Mar, 2022 19:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో 7 దశల్లో, మణిపూర్‌లో 2 దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

వార్తా చానళ్లు, వెబ్‌సైట్‌లు తమ అందించిన సమాచారం ఆధారంగా ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తుంటాయి. అయితే కచ్చితమైన, అధికారిక సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

ఎలా చూడాలి?
► ముందుగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ (results.eci.gov.in)లోకి వెళ్లాలి.  
 
► 'అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికలు - మార్చి 2022' లింక్‌పై క్లిక్ చేయండి.

► క్లిక్‌ చేయగానే మీరు కొత్త వెబ్‌పేజీకి మళ్లించబడతారు

► ఎన్నికల ఫలితాలను చూడాలనుకుంటున్న రాష్ట్రం పేరుపై క్లిక్ చేయండి.

► క్లిక్‌ చేయగానే ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ పేజీ ఓపెనవుతుంది.

► పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థులు అందరూ, నియోజకవర్గాల వారీగా ట్రెండ్స్‌.. ఆప్షన్‌లలో దేనినైనా ఎంచుకోండి. 

► ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ఫలితం వెల్లడిస్తారు.

► దీంతో పాటు sakshi.comలోనూ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు