ఐదేళ్ల పాప.. పేద్ద పెయింటింగ్‌!

26 Oct, 2021 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: పిట్ట కొంచెం కుతం ఘనం అంటే ఇదేనేమో. ఇలా ఎందుకు అన్నానంటే కొంత మంది పిల్లలు చిన్న వయసులోనే వాళ్ల అసాధారణ ప్రతిభతో భలే ఆకట్టుకుంటారు. అచ్చం అలానే ఇక్కడ ఒక ఐదేళ్ల పాప తన పెయింటింగ్‌ స్కిల్‌తో భలే ఆకర్షిస్తోంది. ఎంత అద్భుతంగా పేయింటింగ్స్‌ వేస్తుందంటే మనం చూపు కూడా తిప్పకుండా అలా చూస్తూనే ఉండిపోతాం. అయితే ఆ పాప పెద్ద కాన్వాస్‌పై అత్య‍ద్భుతంగా పెయింటింగ్స్‌ వేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు)

పైగా ఆ వీడియో మొదలు పెట్టినప్పుడు ఒకలా తర్వాత పూర్తైయ్యాక మరింత అద్భుతమైన పెయింటింగ్‌లా ఆవిష్కృతమవుతుంది.  దీంతో నెటిజన్లు చాలామంది పిల్లలు ఏదో ఒక దానిపై మూడు నిమిషాలకు మించి దృష్టి పెట్టలేరు కానీ ఆమె అలా నిర్విరామంగా అంతసేపు అంతా పెద్ద పెయింటింగ్‌ వేయడం అత్యద్భుతం అంటూ రకరకాలు ట్వీట్‌ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్‌ వేయండి.

(చదవండి: ఉబర్‌ డ్రైవర్‌ని వరించిన రూ. 75 లక్షల లాటరీ)

మరిన్ని వార్తలు