పొగమంచు ఎఫెక్ట్‌తో పలు విమానాలు దారి మళ్లింపు

2 Dec, 2023 10:49 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో విమానాల రాకపోకలకు పొగ మంచు అడ్డం పడింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా విమానాలు ల్యాండ్‌ కాలేకపోతున్నాయి. దీంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ఇప్పటికే దారి మళ్లించిన విమానాల సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఉదయం 6.15కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని(AI559) జైపూర్‌కు దారి మళ్లించారు. ఈ విమానంలోనే వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. దీంతో ఆయన 11 గంటలకు జరుగనున్న పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు ఆలస్యంగా హాజరయ్యే  అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేడు అఖిలపక్ష సమావేశం
పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఉదయం 11గం.లకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో ఈ భేటీ జరగనుంది. వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు అవుతుండగా.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ఎజెండాగా ఈ భేటీ జరుతోంది. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4 నుంచి 22 వరకూ కొనసాగనున్నాయి పార్లమెంటు శీతాకాల సమావేశాలు.

మరిన్ని వార్తలు