రెక్కలు విప్పి ఎగిరే తాబేళ్లను చూశారా?

17 Mar, 2021 08:38 IST|Sakshi

మీరు ఎప్పుడైనా తాబేలు ఈగను చూశారా. ఈగ పరిమాణంలో ఉండే తాబేలును చూశారా. అప్పుడు చూడకపోయినా పరవాలేదు, ఇప్పుడు చూడండి.. తాబేలు, ఈగ రెండూ కలిసిన తాబేళ్లు కనువిందు చేస్తున్నాయి. అతి చిన్నగా ఉండే ఈ తాబేళ్లు, ఒక్కసారిగా రెక్కలు విప్పి ఎగురుతున్నాయి. సోషల్‌ మీడియాలో తాజాగా విడుదలైన ఈ బంగారు రంగు తాబేలు ఈగను అందరూ వింతగా చూస్తున్నారు. కుమ్మరిపురుగు పరిమాణంలో ఈగలా ఎగిరే ఈ బంగారు తాబేళ్లను ముచ్చటగా చూస్తూ, మురిసిపోతున్నారు నెటిజన్లు. సుశాంత్‌ నందా అనే ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసరు, ఈ వీడియోను ట్విటర్‌లో పెట్టారు.

ఒక చేతిలో ఉన్న మూడు బంగారు ఈగ తాబేళ్ల తో ఉన్న ఈ వీడియోను అందరికీ చూపాలనుకున్న ఉద్దేశంతో నందా ఇలా చేశారు. ‘‘కొన్నిసార్లు మెరిసేదంతా బంగారమే’’ అంటూ ట్వీట్‌ చేశారు. మొట్టమొదట ఈ వీడియోను మణిపూర్‌కి చెందిన థాకమ్‌ సోనీ అనే ఆర్టిస్టు అందరికీ షేర్‌ చేశారు. ఈ వీడియోను నందా ట్వీట్‌ చేయటంతో బాగా వైరల్‌ అవుతోంది. ఇవి 5–7 మి..మీ. పరిమాణంలో ఉంటాయి. ఒక్కోసారి వీటి ఒంటి మీద మచ్చలుంటాయి. ఇవి దక్షిణ తూర్పు ఆసియాలో సాయంత్రం సమయంలో అందరికీ కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఇవి బంగారంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను చూసినవారంతా, వారి ప్రాంతాలలో కనిపించే ఇటువంటి తాబేళ్ల గురించి రీట్వీట్‌ చేస్తున్నారు.

చదవండి: పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి

మరిన్ని వార్తలు