దారుణంగా కొట్లాడుకున్న ఫుడ్‌ డెలివరి మ్యాన్‌, సెక్యూరిటీ గార్డు... షాక్‌లో స్థానికులు

9 Oct, 2022 18:23 IST|Sakshi

నోయిడా: ఫుడ్‌ డెలివర్‌ మ్యాన్‌, సెక్యూరిటీ గార్డుల మధ్య తలెత్తిన వివాదం కొట్లాటకు దారి తీసింది. ఈ ఘటన నోయిడా గార్డెనియా సోసైటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సబీ సింగ్‌ అనే జోమాటో ఫుడ్‌ డెలవరీ మ్యాన్‌ సెక్యూరిటీ గార్డ్‌ రామ్‌ వినయ్‌ల మధ్య ఎంట్రీ విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదరి ఒకరినోకరు గాయపరుచుకునే వరకు వచ్చింది.

మొదటగా ఫుడ్‌ డెలివరీ మ్యాన్‌ సబీ సింగ్‌ సెక్యూరిటీ గార్డుని కొట్టడం, నెట్టడం వంటివి చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన గార్డు కర్ర తీసుకుని ఫుడ్‌ డెలివరీ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో ఇద్దరు కాసేపు కర్రలతో ఘోరంగా కొట్టుకున్నారు. స్థానికులు ఆపేందుకు యత్నించిన ఇద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. కాసేపటికి ఫుడ్‌ డెలవరీ మ్యాన్‌ స్ప్రుహ తప్పి నేలపై పడిపోయాడు. దీంతో ఘటనా స్థలం వద్ద ఉన్న స్థానికులు అతనికి సపర్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలాని చేరుకుని ఇరువురి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 

(చదవండి: ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...)

మరిన్ని వార్తలు