Karnataka Food Poisoning: చికెన్‌ కబాబ్‌తో ఫుడ్‌ పాయిజన్‌.. నర్సింగ్‌ విద్యార్థులకు అస్వస్థత

8 Feb, 2023 11:59 IST|Sakshi

కర్ణాటక: దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినులు ఘీ రైస్, చికెన్‌ కబాబ్‌ తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి సిటీ నర్సింగ్‌ హాస్టల్‌లో ఉంటున్న 137 మంది విద్యార్థినులు ఆహారం ఆరగించారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వంటల్లో శుభ్రత పాటించకపోవడంతో కలుషితమైనట్లు తెలుస్తోంది. బాధితులను సిబ్బంది  సిటీ ఆస్పత్రిలో చేర్చారు. మొత్తం 137 మంది విద్యార్థులను మంగళూరు నగరంలోని వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 

తల్లిదండ్రుల ఆగ్రహం  
సోమవారం రాత్రి పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. కాలేజీ యాజమాన్యంపై కద్రి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.  హాస్టల్‌లోని అస్తవ్యస్త పరిస్థితులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చాలా మంది విద్యార్థులు కోలుకున్నారు.  కొందరు డిశ్చార్జ్‌ కాగా 38 మంది విద్యార్థులు ఆస్పత్రిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు