చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్‌

18 Mar, 2023 16:35 IST|Sakshi

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా-భారత్‌ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమస్య పరిష్కారమైతే గానీ భారత్‌, చైనా మధ్య సంబంధాలు యధాస్థితికి రాలేవని విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాలు బలగాలు ఉపసంహరణ విషయంలో కాస్త పురోగతి సాధించాయి. ఘర్షణ ప్రాంతాల్లో సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ లడఖ్‌లోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారత్‌ చైనాల మద్య పరిస్థితి చాలా పెళుసుగా, ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు.

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉందని, ఎందుకంటే మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయని అన్నారు. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ‍ప్రమాదకరంగానే ఉంది అని అన్నారు. పైగా ఆయా ప్రాంతాల్లో సైనిక బలగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు

ఈ ప్రాంతాల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించగా, సుమారు 40 మందికి పైగా చైనీస్‌ సైనికులు మరణించడం లేదా గాయపడటం జరిగింది. అంతేగాదు 2020 మధ్యలో ఈప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడూ దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి సద్ధుమణిగింది. అలాగే డిసెంబర్‌లో గుర్తింపులేని సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో హింస చెలరేగింది. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదు. 

(చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..)

మరిన్ని వార్తలు