మనుషుల రక్తానికి రుచి మరిగింది.. 9 మందిని చంపి చివరకు ఇలా.. 

8 Oct, 2022 21:26 IST|Sakshi

మనుషుల రక్తానికి రుచిమరిగిన ఓ పులి ఏకంగా తొమ్మిది మందిని దారుణంగా చంపింది. గ్రామస్తులపై ఎగబడి పంజా విసురుతూ ప్రతాపం చూపించింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చంపారన్‌ జిల్లాలోని బగాహ అనే గ్రామంపై పులి దాడి చేస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 9 మందిని కిరాతకంగా దాడి చేసి చంపింది.

దీంతో, స్థానికుల ఫిర్యాదు మేరకు కొన్నివారాల నుంచి పులిని బంధించేందుకు ఏనుగులతో గాలించినా జాడ కనిపించలేదని అటవీ సిబ్బంది తెలిపారు. ఇక, మూడు రోజుల వ్యవధిలోనే నలుగురిని చంపినట్లు చెప్పారు. దీంతో, బీహార్‌ ప్రభుత్వం అనుమతి తీసుకొని షార్ప్‌ షూటర్లతో పులిని చంపినట్లు అటవీ సిబ్బంది వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

మరిన్ని వార్తలు