వైరల్‌: లోయలో పడిన ఏనుగు.. క్రేన్‌తో ఇలా..!

29 Aug, 2020 15:09 IST|Sakshi

క్రేన్‌ సాయంతో అధికారులు ఆ ఏనుగును కాపాడిన 

సాక్షి, బెంగళూరు: ఓ లోయలో పడిపోయిన ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రేన్‌ సాయంతో ఆ ఏనుగును కాపాడిన సంఘటన కర్ణాటకలోని వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆటవీ అధికారి ఏడుకొండలు తన ట్విటర్‌లో బుధవారం షేర్‌ చేశారు. దీనికి ‘ఆర్కానహల్లా లోయలో వద్ద ఆకస్మాత్తుగా ఏనుగు పడిపోయినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో  అధికారులు అక్కడికి చేరుకుని దానిని రక్షించారు. ఇందుకు అటవీ ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, అగ్నిమాపక విభాగంలో పనిచేసే సిబ్బంది చాలా సహాయపడ్డారు’ అంటూ అధికారి ట్వీట్‌ చేశారు. (చదవండి: ‘వావ్‌.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’)

42 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో అధికారులు ఏనుగు పైకి ఎక్కేందుకు వీలుగా అధికారులు లోయ నుంచి క్రేన్‌ సాయంతో దారిని తీశారు. అనంతరం ఆ ఏనుగు సులభంగా పైకి వచ్చింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. వెంటనే స్పందించి.. ఏనుగును రక్షించిన సదరు అధికారులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘దేశవ్యాప్తంగా ఆటవీ అధికారులు అందిస్తున్న సేవలకు గాను చాలా కృతజ్ఞతలు’, ‘థ్యాంక్యూ.. మీరంతా ఎపుడూ ఇలాగే మీ సేవలను అందిస్తూ మూగ జీవాలను రక్షించాలని ఆశిస్తున్నాము’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.
(చదవండి: పిల్లిని పెంచుకుంటే ఎన్ని లాభాలో!..)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా