గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి మృతి

16 Apr, 2022 07:21 IST|Sakshi
జివి శ్రీరామరెడ్డి (ఫైల్‌) 

సాక్షి, బాగేపల్లి/చిక్కబళ్లాపురం: ప్రజల కోసం నిరంతరం పోరుబాటలో నడిచిన పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీరామరెడ్డి (75) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. సీపీఎం పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన మోకాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. బాగేపల్లిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  స్థానిక ప్రభుత్వ పాఠశాలలో జీవి శ్రీరామరెడ్డి పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి డాక్టర్‌ సుధాకర్, ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌.సుబ్బారెడ్డి, నిడుమామిడి పీఠాధ్యక్షుడు వీరభద్ర చెన్నమల్ల మహా స్వామీజీ, మాజీ కేంద్ర మంత్రి. కే.హెచ్‌. మునియప్ప, ఎమ్మెల్యే రమేష్‌ కుమార్, కే.శ్రీనివాస్‌గౌడ,హెచ్‌.ఎన్‌.శివశంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌.సంపంగి, డాక్టర్‌ ఎం.సి.సుధాకర్, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జీవీకి ఘన నివాళి అర్పించారు. 

చదవండి: (నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్‌)

మరిన్ని వార్తలు