బిహార్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా జితన్‌రామ్‌ మాంజీ

19 Nov, 2020 16:26 IST|Sakshi

పట్నా: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్‌రామ్‌ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ ఫగుచౌహాన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్‌ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

తూర్పు బిహార్‌కు చెందిన 76 ఏళ్ల జితన్‌ రామ్‌ బిహార్‌ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్‌ రామ్‌.. చంద్రశేఖర్‌ సింగ్‌, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్‌ మిశ్రా, లాలూప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవిల క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 

మరిన్ని వార్తలు