మందు గ్లాసుతో మాజీ మంత్రి కొడుకు అరాచకం.. ఫుల్లుగా తాగి రోడ్డుపై హల్‌చల్‌

24 May, 2022 10:18 IST|Sakshi

మద్యం మత్తులో కాంగ్రెస్‌ మాజీ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. మద్యం మత్తులోనే ఓ వ్యాపారి కారును ఢీకొని అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో బెదిరించాడు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. షాజాపూర్‌కు చెందని కాంగ్రెస్‌ మాజీ మంత్రి హుకుమా కరాడ కొడుకు రోహితప్‌ సింగ్‌ మ‍ద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్‌ క్రియేట్‌ చేశాడు. తన ఎస్‌వీయూ(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్‌ అహుజా కారును ఢీకొట్టాడు. దినేస్‌ అహుజా అతడి అనుచరులతో కలిసి భోపాల్‌ నుంచి ఇండోర్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

అయితే, భాదితులు దినేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్‌ సింగ్‌ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్‌ మరింత రెచ్చిపోయాడు. బాధితులు తాము పోలీస్‌ స్టేషన్‌కు వెళతాము. నష్ట పరిహారం ఇవ్వాలని కోరడంతో వారు రోహితప్‌ మరింత రెచ్చిపోయాడు. మరోసారి దినేష్‌ కారును ఢీకొట్టాడు. 

దీంతో దినేష్‌, అతడి అనుచరులు.. రోహితప్‌ను బయటకు దిగాలని కోరడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్టు తెలిపారుకాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు అష్టా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు. కారు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

ఇది కూడా చదవండిఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి

మరిన్ని వార్తలు