కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కన్నుమూత.. సీఎం సంతాపం

25 Jul, 2022 08:44 IST|Sakshi

భువనేశ్వర్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ‍మాజీ లోక్‌సభ సభ్యుడు సుభాష్‌చంద్ర నాయక్‌(75) తుదిశ్వాస విడిచారు. ఒడిషాలోని భవానీపట్నలో ఉన్న ఆయన నివాసంలో తీవ్ర గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. ​కాగా, సుభాష్‌చంద్ర నాయక్‌.. 1991 నుంచి 1995 వరకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కలహండి నుంచి ప్రాతినిధ్యం వహించారు.

అనంతరం సంఘ సేవకునిగా విశేష గుర్తింపు సాధించారు. ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఉద్యోగానికి స్వస్తి పలికి, పాత్రికేయ రంగంలోకి ప్రవేశించిన ఆయన.. కార్మిక నాయకుడిగా కూడా సుపరిచుతులు. ఇక, కలహండి ప్రాంతంలో దివ్యాంగుల సమస్యలను అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లి, రాజకీయ రంగంలో గుర్తింపు సాధించారు.  కాగా, ఆయన అంత్యక్రియలను పూరీ స్వర్గద్వార్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. సుభాష్‌చంద్ర నాయక్‌ మృతి పట్ల సీఎం నవీన్‌ పట్నాయక్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. 

ఇది కూడా చదవండి: పదిరోజుల్లో మూడోసారి.. బీజేపీ పదే పదే అవమానిస్తోందా?

మరిన్ని వార్తలు