సోలో సెయిలింగ్‌ రేస్‌లో చరిత్ర సృష్టించిన భారత ఇండియన్‌ నేవీ ఆఫీసర్‌

29 Apr, 2023 12:57 IST|Sakshi

రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌ అభిలాష్‌ టోమీ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌లోని లెస్‌ సాబుల్స్‌ డి ఒలోన్‌ నుంచి ప్రారంభమైన సోలో సెయిలింగ్‌ రేస్‌లో ప్రపంచవ్యాప్తంగా చుట్టూ వచ్చిన సెయిలర్‌గా(నావికుడు) రెండో స్థానంలో నిలిచాడు. ఈ రేస్‌ సెప్టెంబర్‌ 4,2022న ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది.

దీంతో టోమీ ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ రేస్‌ను పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా సోలో సెయిలింగ్‌ రేసులో రెండో స్థానం దక్కించుకున్న వ్యక్తిగా నిలిచాడంటూ రేసు అధికారిక వెబ్‌పేజ్‌లో ఒక ప్రకటనలో వెల్లడించింది. 

(చదవండి: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వలేదని భార్య క్షణికావేశంతో..)

మరిన్ని వార్తలు