త్వరలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తా..

9 Sep, 2020 14:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లోని గుప్కర్ రోడ్‌లో తనకు కల్పించిన ప్రభుత్వ వసతి గృహన్ని అక్టోబర్‌ చివరి నాటికి ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది తాను  స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయమని  బుధవారం సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అయితే గతేడాది ప్రభుత్వ వసతి గృహంలో ఆయన అక్రమంగా ఉంటున్నారని వెంటనే దానిని ఖాళీ చేసి ప్రభుత్వానికి ఆయన అప్పగించాలని జమ్మూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు మీడియాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు. దీనిపై జమ్మూ కశ్మీర్‌ అడ్మిస్ట్రేషన్‌కు ఆయన లేఖ కూడా రాశారు. 

‘జమ్మూకశ్మీర్‌ పరిపాలనకు నా లేఖ. నేను శ్రీనగర్‌లోని నా ప్రభుత్వ వసతిని అక్టోబర్ చివరికి ముందే ఖాళీ చేస్తాను. నేను మీకు తెలియజేయాలనుకుంటుంది ఏమిటంటే నేను తగిన వసతి కోసం అన్వేషణ ప్రారంభించాను. అయితే కరోనా కారణంగా ఆ ప్రక్రియకు ఆలస్యమైంది. అన్ని విధాల సౌకర్వవంతమైన ఇంటి కోసం చుస్తున్నాను. త్వరలో ఇళ్లు దొరకగానే గుప్కర్ ప్రభుత్వ వసతిని ఖాళీ చేస్తాను. దీనికి నాకు 8 నుంచి 10 వారాల సమయం పట్టోచ్చు. అప్పటి వరకు నాకు సమయం ఇవ్వాలని విజ‍్క్షప్తి’’ అంటూ జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆయన విజ‍్క్షప్తి  చేశారు. అంతేగాక ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం తనకు  లేదని లేఖలో తెలిపారు. 

జమ్ము-కశ్యీర్‌ మాజీ సీఎంల హక్కులలో కొన్ని నెలల క్రితం చేసిన మార్పుల ప్రకారం తాను ఈ వసతి గృహంలో అనధికారికంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు గతేడాది మీడియాలో వార్తలు ప్రచురితమయ్యాయన్నారు. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్ఫస్టం చేశారు. త్వరలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్నది నా స్వంతంగా తీసుకున్న నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు శ్రీనగర్‌ లేదా జమ్మూలోని వసతి గృహల్లో ఉండాలనే ప్రభుత్వ నిబంధనల మేరకే తాను శ్రీనగర్‌లోని వసతి గృహన్ని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు