సోనియాతో కమల్‌నాథ్‌ భేటీ

16 Jul, 2021 06:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి గురువారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో కమల్‌నాథ్‌ మరింత కీలకం కానున్నా రంటూ ఊహాగానాలు వెల్లువెత్తు తున్న సమ యంలో జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో ప్రక్షాళన జరగా లంటూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్‌ నేతలు సహా అందరితోనూ కమల్‌నాథ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. కొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న కమల్‌నాథ్‌తో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోనియా ప్రత్యేకంగా సమావేశం కావడం గమనార్హం.   

మరిన్ని వార్తలు