జయా జైట్లీకి షాక్‌ : నాలుగేళ్ల జైలుశిక్ష

30 Jul, 2020 16:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీ కోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. జయా జైట్లీతో, మరొక ఇద్దరికి నాలుగేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. 2001నాటి రక్షణ శాఖ ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వీరికి నాలుగేళ్ళ జైలు శిక్షను విధింస్తూ గురువారం తీర్పును వెలువరించింది. మరో రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. దోషులుగా తేలిన జయా జైట్లీ, సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్‌పీ ముర్గయి గురువారం సాయంత్రం 5 గంటలలోగా లొంగిపోవాలని సీబీఐ న్యాయమూర్తి జడ్జి వీరేందర్ భట్ ఆదేశించారు. ఈ మేరకు వివరాలను దోషుల్లో తరపు న్యాయవాది విక్రమ్ పన్వర్ మీడియాకు వివరించారు.
 

మరిన్ని వార్తలు