నా అదృష్టం...గర్వంగా ఉంది : నిర్మలా సీతారామన్‌

4 Mar, 2021 13:12 IST|Sakshi

కోవిడ్‌  వ్యాక్సిన్‌ స్వీకరించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

నర్స్‌ రమ్యకు ధన్యవాదాలు : సీతారామన్‌

 భారతదేశంలో పుట్టడం అదృష్టం

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురువారం ఆమె కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను స్వీకరించారు. అనంతరం సీతారామన్‌ మాట్లాడుతూ భారతదేశంలో ఉండటం తన  అదృష్టం ఇందుకు తనకు  గర్వంగా  ఉందంటూ అంటూ వ్యాఖ్యానించారు.  అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు టీకా వేసిన నర్స్‌ రమ్యకు థ్యాంక్స్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరసమైన ధరలో  టీకా లభిస్తున్న దేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ  ట్వీట్‌  చేశారు. (పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్న ఢిల్లీ సీఎం)

కాగా దేశంలో ప్రస్తుతం రెండో దశ  వ్యా క్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 60  ఏళ్లుదాటినవారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలు కేంద్ర మంత్రులు,    కొన్ని  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర  రంగాల దిగ్గజాలు టీకాను వేయించుకున్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు