బంపరాఫర్‌.. ఆ షాపులో ఒక డ్రెస్‌ ఖరీదు రూ.1 మాత్రమే..!

3 Nov, 2021 20:14 IST|Sakshi

బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో పేదలు జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది ఎన్‌జీవోస్‌, స్యచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిచడానికీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నిరుపేదలను ఆదుకునేలా బెంగళూరులోని  నలుగురు స్నేహితులు సరికొత్త ఆలోచనతో ముందుకు రావడమే కాక కార్యాచరణలోకి తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

(చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్‌ ఇస్తాడట)

ఈ మేరకు మెలిషా నొరోన్హా అనే ఆమె తన భర్త వినోద్ లోబో, తల్లి గ్లాస్గో, మరో ఇద్దరు స్నేహితులు నితిన్ కుమార్, విఘ్నేశ్‌తో సహా కలసి 2013లో పేద ప్రజల కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల దీనస్థిత చూశక వారికి క్లాత్‌ బ్యాంక్‌ అనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే తాము ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  సెప్టెంబర్ 2021లో బెరటేన అగ్రహారంలో లవకుశ లే అవుట్‌లోని ఒక చిన్న డబల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్‌లో షాపును ప్రారంభించారు.

అయితే ఈ షాపుకి అక్కడ ఎలక్ట్రానిక్‌ సిటీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు బట్టలను విరాళంగా ఇచ్చారు. ఈ క్లాత్‌ బ్యాంక్‌లో పేదవాళ్లు తమకు నచ్చిన దుస్తులను ఎన్నుకోవచ్చు. పైగా వాటి ధర రూ.1 మాత్రమే. పైగా ఈ క్లాత్‌ షాపులోని క్లాత్‌లు అమ్మగా వచ్చిన డబ్బులను కూడా వారు నిరుపేద కుటుంబాల పిల్లల చదువు, వైద్య ఖర్చుల అవసరాలకు నిధులుగా సమకూరుస్తున్నారు.

అంతేకాదు ఒక పేద కుటుంబం సంవత్సరానికి దుస్తులు కోసం రూ. 2000 ఖర్చు చేస్తున్నారు. అదే ఈ బ్యాంక్‌ ద్వారా వారికి డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈ మేరకు వినోద్‌, నితిన్‌ మాడుతూ.."2002లో మంగళూరులోని సెయింట్ అలోసియస్‌లో మా కాలేజ్ డేస్‌లోనే ఈ క్లాత్‌ బ్యాంక్‌ ఆలోచన ఉంది. మేము అప్పుడు కూడా మా స్నేహితు సాయంతో దుస్తులను సేకరించి పేదలకు పంపిణీ చేసేవాళ్లం." అని అన్నారు.

(చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..)

మరిన్ని వార్తలు