విహారయాత్రలో విషాదం.. అమ్మాయిలు మృతి

26 Nov, 2022 20:36 IST|Sakshi

సరదా కోసం వెళ్లిన విహారయాత్ర విద్యార్థులకు విషాదాన్ని నింపింది. వాటర్‌ఫాల్స్‌ వద్ద ఎంజాయ్‌ చేసే క్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్థినిలు మృత్యువాతపడగా.. మరో యువతి ప్రాణాల కోసం ఆసుప్రతిలో పోరాడుతోంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. కర్నాటలోని బెలగావికి చెందిన 40 మంది వి​ద్యార్థినిలు పిక్నిక్‌ ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో టూర్‌ కోసం మహారాష్ట్ర వెళ్లారు. ఈ సందర్భంగా కొల్హాపూర్‌ జిల్లాలోని కిట్వాడ్‌ వాటర్‌ఫాల్స్‌ వద్దకు చేరుకున్నారు. అనంతరం, యువతుందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సమయంలో మృత్యువు వారిని వెంటాడింది. 

విద్యార్థినిలు సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో ఐదుగురు యువతులు అదుపుతప్పి జలపాతంలో పడిపోయారు. ఈ క్రమంలో నలుగురు యువతులు మృతిచెందగా.. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది మరో యువతిని కాపాడారు. కానీ, ఈ ప్రమాదంలో సదరు యువతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే బెలగావిలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, మృతిచెందిన వారిని ఆసియా ముజావర్‌(17), కుద్రషియా హసమ్‌ పటేల్‌(20), రుక్కాషా భిస్తీ(20), తాస్మియా(20)గా గుర్తించారు. వీరి మృతి కారణంగా విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా ముగిసింది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు