వర్షాల ఎఫెక్ట్‌.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌.. వీడియో వైరల్‌

9 Jul, 2022 20:30 IST|Sakshi

Four Storey Building Collapsed In Shimla: దేశవ్యవాప్తంగా ఎడతెరిపలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో నదులు పొర్లొపొంగుతున్నాయి. పురాతన, శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా, సిమ్లాలోని చౌపల్‌ బజార్‌లో ఓ భవనంతో బ్యాంకు, రెండు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఆ భవనం కూలిపోయింది. అయితే, వర్షాల నేపథ్యంలో ముందగానే భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు.. కొద్దిరోజులుగా హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. సీఎం కేసీఆర్‌ హెచ్చరిక ఇదే..

మరిన్ని వార్తలు