ఇంట్లో చొరబడి యువతులపై లైంగిక దాడికి యత్నం

11 Nov, 2021 09:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పరిధిలోని రాజానుకుంట వద్ద అద్దిగానహళ్లి గ్రామంలో జూన్‌ 8వ తేదీ తెల్లవారుజామున ఒక కార్పెంటర్‌ ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో వారిని బెదిరించి రూ.10వేల నగదు, కొంత బంగారం దోచుకున్నారు.

(చదవండి: విమానాలకు రన్‌వేగా..)

కామంతో కళ్లుమూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడడంతో పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

(చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్‌)

మరిన్ని వార్తలు