UP CM Yogi Adityanath: యూపీ ప్రజలకు సీఎం యోగి భారీ ఆఫర్‌

26 Mar, 2022 15:37 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీల్లో భారీ విజయాన్ని అందుకున్న అధికార బీజేపీ పార్టీ శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే 52 మందిలో కేబినెట్‌ను విస్తరించారు

ఇదిలా ఉండగా శనివారం మంత్రి మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా, యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పథకమే కీలక పాత్ర పోషించింది. ఇక, సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్‌ అందనుంది.

అయితే, కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్‌ పథకాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్‌ మాట్లాడుతూ.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందాల‌న్న‌ది త‌మ ఉద్దేశ‌మ‌ని వెల్లడించారు. సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్‌ అందనుంది. మూడు నెలల ఉచిత రేషన్‌ అందిస్తున్నందుకు గాను ప‍్రభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు