-

సామాన్యుడిపై మరో పిడుగు

2 Mar, 2021 18:40 IST|Sakshi

ఇప్పటికే చమురు ధరలు మండిపోతుండటంతో అవస్థలు పడుతున్న సామాన్యూడిపై మరో పిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్‌ ధరల కారణంగా రవాణా ఛార్జీలు 25శాతం వరకు పెరగవచ్చని ఆల్ ‌ఇండియా ట్రాన్స్‌పోర్టు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ప్రదీప్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా డీజిల్ ధరలు 30 నుంచి 35 శాతం పెరిగాయి. దీని కారణంగా రవాణా ఛార్జీలను 25 శాతం నుండి 30 శాతం పెంచడం తప్ప మాకు మరో మార్గం లేదు అని సింఘాల్‌ అన్నారు. సాధారణంగా ఇటువంటి ఒప్పందాలు‌ కంపెనీల మధ్య వార్షిక, అర్థ సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఇప్పటికే మార్కెట్ లో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా మధ్యలో రేట్లు పెంచడానికి సాధ్యపడదు. ఆ భారాన్ని మేమే భరించాలి అని అన్నారు.  

మార్కెట్ ధరలు అనుగుణంగా ధరలను పెంచకపోతే ఆ ప్రభావం రవాణ సంస్థల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మా మూలధన వ్యయాలు పెరుగుతాయి. అందుకే డీజిల్‌ ధరలను తగ్గించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది అన్ని పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. అందుకే చమురు ధరలు భారతదేశం అంతటా ఒకేలా ఉండాలి. అప్పుడే అన్ని ప్రదేశాలకు మా ట్రక్కులను పంపిస్తాము. చమురు ధరల సవరింపు అనేది కూడా నెలకు ఒకసారి మాత్రమే చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ప్రదీప్‌ అన్నారు. ఒకవేల రవాణా ఛార్జీలు పెంచినట్లయితే ఈ ప్రభావం ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉంది.

చదవండి:

ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్


 

మరిన్ని వార్తలు