‘హ్యాపీడేస్‌’ మూవీని మించిన ర్యాగింగ్‌.. జూనియ‌ర్ అమ్మాయిల‌తో ఇంత దారుణమా..

30 Jul, 2022 16:21 IST|Sakshi

Seniors ragging.. కాలేజ్‌ డేస్‌ అనగానే చాలా మందికి హ్యాపీడేస్‌ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్‌ చేసే సీన్స్‌ నవ్వుతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అలాగే, కొందరు విద్యార్థులు తాము కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ర్యాగింగ్‌ను గుర్తు చేసుకుని కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం భయంతో వణికిపోతారు. 

తాజాగా ఇలాంటి ఘటనే ఓ మెడికల్‌లో చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన సీనియర్స్‌.. జూనియర్ల పట్ల వికృత చర్యలకు దిగారు. జూనియ‌ర్ అమ్మాయిల‌తో కూడా అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని మ‌హాత్మాగాంధీ మెడిక‌ల్ కాలేజీలో ర్యాగింగ్‌ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. హాస్టల్‌లో జూనియ‌ర్ల‌ను త‌మ రూమ్స్‌లోకి పిలిపించుకుని ఓవర్‌గా బిహేవ్‌ చేశారు. దిండ్ల‌తో శృంగారం చేయాల‌ని వారిని బ‌ల‌వంతం చేశారు. ఈ క్రమంలోనే జూనియ‌ర్ అమ్మాయిల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. ఒక‌రికొక‌రు కొట్టుకోవాల‌ని బెదిరించారు. దీంతో, సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు.. యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్‌కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబ‌ర్‌కు కాల్‌ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. 

విద్యార్థుల ఫిర్యాదులో ర్యాగింగ్‌ ఘటనను సీరియస్‌గా తీసుకున్న యూజీసీ.. రంగంలోకి దిగి విచార‌ణ‌ జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురిచేసిన సీనియ‌ర్ల‌ను గుర్తించి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌ళాశాల యాజ‌మాన్యానికి యూజీసీ ఆదేశించింది. దీంతో, పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 కింద సీనియర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్‌లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు