నీలగిరి జిల్లాలో లిక్కర్‌ కొనాలంటే ఆధార్‌తో పాటు ఆ సర్టిఫికెట్‌ తప్పనిసరి

3 Sep, 2021 10:43 IST|Sakshi

చెన్నై: దేశంలో కరోనా కేసులు కేరళ, మహారాష్ట్రల తర్వాత తమిళనాడులో అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నియత్రించేందుకు తమిళనాడులోని నీలగిరి జిల్లా అధికారులు వినూత్న నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డాలుగా మారిన వైన్స్‌ షాపుల వద్ద ఈ నిబంధనలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 

వైన్స్‌లో లిక్కర్‌ కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్‌ కార్డుతో పాటు రెండు డోసులు పూర్తి చేసుకున్న వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని కండీషన్‌ పెట్టారు. ఈ రెండు ఉన్న వారికే మద్యం విక్రయిస్తామని లేకపోతే లేదని స్పష్టం చేశారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ నిబంధన అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్‌ దివ్య వెల్లడించారు. 
చదవండి: మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు; లక్ష్మణరేఖ దాటి ప్రవర్తించబోం..!

>
మరిన్ని వార్తలు