తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం
అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అవయవదానానికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని స్పష్టం
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదాతల అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించారు. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని స్టాలిన్ తెలిపారు. తాజా ప్రకటన అవయవదానానికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని అన్నారు.
విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే తమిళనాడు ఈ స్థానంలో ఉందని స్టాలిన్ కొనియాడారు. అవయవదాతలకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు