ఇండియా–మిడిల్‌ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌

10 Sep, 2023 05:31 IST|Sakshi
బైడెన్, మోదీలతో ఈయూ ప్రెసిడెంట్‌ ఉర్సులా

భారత్, అమెరికా తదితర దేశాల సంయుక్త ప్రకటన 

అవగాహనా ఒప్పందంపై సంతకాలు  

న్యూఢిల్లీ: చైనాకు చెందిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌కు ధీటుగా, దేశాల మధ్య వేగవంతమైన అనుసంధానమే ధ్యేయంగా భారత్, అమెరికా తదితర దేశాలు ప్రతిష్టాత్మక ఆర్థిక నడవా(ఎకనామిక్‌ కారిడార్‌)ను తెరపైకి తీసుకొచ్చాయి. ఇండియా–మిడిల్‌ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ నూతన ప్రాజెక్టును భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నేతలు శనివారం సంయుక్తంగా ప్రకటించారు.

ఈ మేరకు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై వారు సంతకాలు చేశారు. ఈ కారిడార్‌తో ఆసియా, అరేబియన్‌ గల్ఫ్, యూరప్‌ మధ్య భౌతిక అనుసంధానం మాత్రమే కాదు, ఆర్థిక అనుసంధానం సైతం మరింత పెరుగుతుందని నిర్ణయానికొచ్చారు. దేశాల నడుమ అనుసంధానాన్ని ప్రోత్సాహిస్తూనే అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కనెక్టివిటీని ప్రాంతీయ సరిహద్దుల వరకే పరిమితం చేయాలని తాను అనుకోవడం లేదన్నారు. దేశాల నడుమ పరస్పర నమ్మకం బలోపేతం కావాలంటే అనుసంధానం పెరగడం చాలా కీలకమని స్పష్టం చేశారు.  

రెండు భాగాలుగా ప్రాజెక్టు  
ఇండియా–మిడిల్‌ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో రెండు వేర్వేరు కారిడార్‌లో ఉంటాయి. ఇందులో ఈస్ట్‌ కారిడార్‌ ఇండియాను, పశి్చమ ఆసియా/మధ్య ప్రాచ్యాన్ని కలుపుతుంది. ఉత్తర కారిడార్‌ పశి్చమ ఆసియా/మిడిల్‌ఈస్ట్‌ను యూరప్‌తో అనుసంధానిస్తుంది. సముద్ర మార్గమే కాకుండా రైల్వే లైన్‌ కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే. ఇదొక సీమాంతర షిప్‌–టు–రైలు ట్రాన్సిట్‌ నెట్‌వర్క్‌. దీంతో దేశాల నడుమ నమ్మకమైన, చౌకైన రవాణా సాధ్యమవుతుంది. వస్తువులను సులభంగా రవాణా చేయొచ్చు. రైలు మార్గం వెంట డిజిటల్, విద్యుత్‌ కేబుల్స్, క్లీన్‌ హైడ్రోజన్‌ ఎగుమతి కోసం పైపులు ఏర్పాటు చేస్తారు. ఇండియా–మిడిల్‌ఈస్ట్‌–యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ అనేది చరిత్రాత్మకమని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివరి్ణంచారంటే దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు