గెయిల్‌(ఇండియా) లిమిటెడ్‌లో 220 పోస్టులు

12 Jul, 2021 13:25 IST|Sakshi

న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ.. గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(గెయిల్‌).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 220
పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్‌ ఇంజనీర్, సీనియర్‌ ఆఫీసర్, ఆఫీసర్‌.

విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌ స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్‌ఆర్, లా తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021

► వెబ్‌సైట్‌ : https://www.gailonline.com

>
మరిన్ని వార్తలు