పారిశ్రామికవేత్త అదానీకి జెడ్‌ కేటగిరి భద్రత

18 Aug, 2022 07:44 IST|Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ కేటగిరి భద్రత కల్పించింది. వీఐపీలకు ఇచ్చే భద్రత కింద సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఖర్చుని అదానీయే భరిస్తారు. నెలకి రూ.15–20 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. 33 మంది కమాండోలు ఆయనకు కాపలాగా ఉంటారు.

ఇదీ చదవండి: 75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్‌ , బిగ్‌ ఇన్వెస్టర్‌గా అదానీ 

మరిన్ని వార్తలు